Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్యాన్స్‌కు కోసం మహేష్ ప్లాన్... మిస్డ్ కాల్ చేస్తే టచ్‌లొకొస్తాడట!

ఫ్యాన్స్‌కు కోసం మహేష్ ప్లాన్... మిస్డ్ కాల్ చేస్తే టచ్‌లొకొస్తాడట!
, గురువారం, 19 జూన్ 2014 (09:38 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎక్కువుగా ఆడియో ఫంక్షన్ లకు రారు, అభిమానులతో టచ్‌లో వుండరు అనే విమర్శ వుంది. అందుకే ఆయన ఇటీవల ట్విట్టర్‌లో చాలా చురుకుగా వుంటున్నారు. తన సినిమా విశయాలను ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మహేష్ మరో అడుగు ముందుకేసి అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

సిటీల్లో, పట్టణాల్లో అయితే ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో  అందరిదగ్గరా స్మార్ట్ ఫోన్స్, నెట్ అందుబాటులో ఉండవు కదా. అందుకే మహేష్ బాబు టాలీవుడ్‌లో ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసం ఒక నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే తన మెసేజెస్, ట్వీట్స్ రెగ్యులర్‌గా చేరే ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చాడు.

ఫ్యాన్స్‌తో, మీడియాతో తక్కువగా మాట్లాడే మహేష్ ఇక తన అప్‌డేట్స్ అన్నీ ఇలా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోబోతున్నాడు. లేటెందుకు .. 08688464077 నంబర్‌కు మిస్డ్ కాల్ చేసి ప్రిన్స్ అప్‌డేట్స్ ఫ్రీగా మీ మొబైల్‌కు LM-MAHESH పేరుతొ వస్తాయ్. సో.. ఇక మహేష్ మీతో టచ్‌లో ఉండాలంటే ఓ మిస్డ్ కాల్ కొట్టండి.

Share this Story:

Follow Webdunia telugu