Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుద్రమదేవి కోసం లండన్ బృందంతో ఇళయరాజా!

రుద్రమదేవి కోసం లండన్ బృందంతో ఇళయరాజా!
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:30 IST)
రుద్రమదేవి కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎంతో కష్టపడుతున్నారు. రుద్రమదేవి సినిమా కోసం ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలకు స్వరాలను అందించిన 'లండన్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా'తో ఇళయరాజా కలిసి పనిచేశారు. 
 
ఈ ఆర్కెస్ట్రా సైతం ఇళయరాజా రుద్రమదేవి నోట్స్‌ని అర్థం చేసుకోవడానికి ఇబ్బందిపడ్డారట. రుద్రమదేవి కోసం ఇళయరాజా రెడీ చేసిన నోట్స్‌లోనే ఆయనకు గల ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చునని  సినీ పండితులు అంటున్నారు. 'రుద్రమదేవి' సినిమాకి స్వరాలను సమకూర్చినది.. రీ రికార్డింగ్‌ని అందించినది ఇళయరాజానే. ఇందుకుగాను ఆయన లండన్ లోని 'ఏంజిల్ స్టూడియోలో అక్కడి ప్రముఖ సంగీతబృందంతో కలిసి పనిచేశారు.
 
అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన ఓ తమిళ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయన ఈ విషయాన్ని గురించి చెప్పారు. తనకి ఇంతటి సంగీత పరిజ్ఞానం దైవానుగ్రహం వలన లభించిందనీ, మొదటి సినిమా కోసం ఎంత కష్టపడ్డానో.. ఇకముందూ కూడా అంతేలా కష్టపడతానని తెలిపారు. ఇంకేముంది..? ఇళయరాజా సుమధురమైన బాణీలను మోసుకొస్తోన్న 'రుద్రమదేవి' సినిమా కోసం, తెలుగులోని ఆయన సంగీతాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu