Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాధురికి 'మ్యాగీ' చిక్కులు.. ఫుడ్ సెక్యూరిటీ అధికారుల నుంచి నోటీసులు

మాధురికి 'మ్యాగీ' చిక్కులు.. ఫుడ్ సెక్యూరిటీ అధికారుల నుంచి నోటీసులు
, శుక్రవారం, 29 మే 2015 (14:25 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మ్యాగీ నూడుల్స్ వ్యవహారం బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. అసలు విషయానికి వెళితే.. ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతోన్న 'రెండు నిమిషాల్లో నూడుల్స్' ప్రకటనలో మాధురీ దీక్షిత్.. 'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని అంటుంది. 
 
అయితే ఈ ప్రకటనలో ఆమె చెప్పినట్లుగా నూడుల్స్లో న్యూట్రిషన్ విలువలన్నాయన్న మాటలను  ఏవిధంగా నిరూపిస్తారో చెప్పాల్సిందిగా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం మాధురీ దీక్షిత్‌కు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా రెండు వారాల్లోపు సంతృప్తికరమైన సమాధానం చెప్పకుంటే కేసు నమోదు చేస్తామని ఫుడ్ సెక్యూరిటీ అధికారి మహిమానంద్ జోషి తెలిపారు. 
 
కాగా మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి రావడంతో ఒక బ్యాచ్ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu