Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనాపని చేయలేదు... జైలులో లేను... ఇంటికొచ్చాను... మాదాల రవి

నేనాపని చేయలేదు... జైలులో లేను... ఇంటికొచ్చాను... మాదాల రవి
, గురువారం, 30 అక్టోబరు 2014 (21:48 IST)
లైంగిక ఆరోపణల వ్యవహారంపై నటుడు, నిర్మాత మాదాల రవి స్పందించారు. ''నాపైన ఆరోపణలు అవాస్తవాలు, అసత్య ఆరోపణలు. వాటిల్లో ఎటువంటి నిజం లేదు. అన్యాయంగా నాపై కేసు పెట్టారు. దానిపై నేను కోర్టులోనే పోరాడతాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముంది. 
 
నేను ఏ నేరం చేయలేదు. కనుక నాకు నూటికి నూరు శాతం న్యాయం దక్కుతుందని ధృడంగా నమ్ముతున్నాను. నేను ఆరోజు రాత్రే బెయిల్‌పై ఇంటికి వచ్చేశాను. జైలుకి వెళ్ళలేదు. కానీ కొన్ని పత్రికలు, సోషల్‌ వెబ్‌సైట్స్‌లో దుష్ప్రచారం జరిగింది. 
 
నా 40 ఏళ్ళ ఆదర్శవంతమైన జీవితాన్ని దెబ్బతీసే విధంగా వున్నాయి. అన్యాయంగా నాపై ఆరోపణలు చేశారు. నేను నా కార్యక్రమాలలో, షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాను'' అని నటుడు నిర్మాత మాదాల రవి తనపై ఇటీవలే వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu