Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువీతో ప్రీతి జింటా లవ్వాయణం: సహజీవనం చేస్తోందట!

యువీతో ప్రీతి జింటా లవ్వాయణం: సహజీవనం చేస్తోందట!
, సోమవారం, 2 మార్చి 2015 (13:50 IST)
బాలీవుడ్ అందాల సుందరి, సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా మరోసారి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అలాగే యువీతో ప్రేమాయణం మాత్రమే గాకుండా.. ఏకంగా సహజీవనం చేస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
మాజీ ప్రియుడు నెస్ వాడియాతో వివాదం చెలరేగినప్పుడు ప్రీతి చాలా ఒత్తిడికి గురైంది. ఆ సమయంలో ఈ అందాల భామకు యువరాజ్ సింగ్ ఆపన్నహస్తం అందించాడట. అండగా నిలబడి, ఆత్మస్థైర్యాన్ని నింపాడట. 
 
ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య బంధం బలపడి, ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. కాగా నెస్ వాడియా తనను వేధించాడని ఆరోపిస్తూ ప్రీతి జింటా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నెస్ వాడియాతో వివాదం సమయంలో ప్రీతి జింటాపై విమర్శలొచ్చినా.. యువీ మాత్రం ఆమెకు మద్దతివ్వడంతోనే ఈ లవ్వాయణం మొదలైందట. 

Share this Story:

Follow Webdunia telugu