Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ వీడియో నాది కాదు... లక్ష్మీ మీనన్ స్పష్టం..!

ఆ వీడియో నాది కాదు... లక్ష్మీ మీనన్ స్పష్టం..!
, గురువారం, 29 జనవరి 2015 (13:14 IST)
చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సాధించిన హీరోయిన్లకు సంబంధించి బూతు చిత్రాలు, వీడియోలను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇందుకు కారణం వారు కాకపోయిన వారి ఎదుగుదలను జీర్ణించుకోలేని వారు,  కొందరు ఆకతాయిలు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతుంటారు. ఈ సమస్య హాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు తారలనందరినీ వెంటాడుతూనే వుంది. ప్రస్తుతం ఈ బూతు వీడియో సమస్య నటి లక్ష్మీ మీనన్‌కు ఎదురైంది.
 
కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్న లక్ష్మీ మీనన్ ప్రతి చిత్రంలోను లిప్‌లాక్ సన్నివేశాలతో అభిమానులను అలరిస్తున్నప్పటికీ ఆది నుంచి ఇప్పటి వరకూ గ్లామరస్‌గా నటించలేదు. అటువంటి ఆమెకు సంబంధించిన బూతు వీడియో ఇంటర్ నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ విషయం తెలియగానే నెటిజన్లు దానికోసం ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు.
 
ఈ విషయం తెలిసిన లక్ష్మీమీనన్ దిగ్భ్రాంతి చెందింది. వెంటనే స్పందించి ఆ వీడియో తనది కాదంటూ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. పనిలో పనిగా సదరు వీడియోపై విచారణ జరపాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు లక్ష్మీ మీనన్ పోలిన బూతు వీడియోను ఇంటర్‌నెట్‌ నుంచి తొలగించారు. అయితే పలువురు షేర్ చేసుకోవడంతో ఇంకా వాట్స్ యాప్ లో హల్‌చల్ చేస్తున్నట్టు సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బూతు వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి కోసం విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu