Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'దొంగాట'తో తండ్రి కోరిక నెరవేర్చిన మంచు లక్ష్మీ..!

'దొంగాట'తో తండ్రి కోరిక నెరవేర్చిన మంచు లక్ష్మీ..!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:25 IST)
ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు కోరికను ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న నెరవేర్చిందట. చిన్నప్పుడు కూతురు లక్ష్మికి క్లాసికల్ మ్యూజిక్ నేర్పించారు మోహన్ బాబు. ఆమె ఓ మంచి గాయని అవ్వాలని ఆయన కోరుకునేవారు. 
 
అయితే, ఆమె మాత్రం నటిగా, నిర్మాతగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు తండ్రి కోరికను 'దొంగాట' సినిమా ద్వారా తీర్చింది. ఈ సినిమాలో ఆమె ఓ పాట పాడింది. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.. తాను పాడిన పాటను వరికుప్పల యాదగిరి రాశారని తెలిపింది. 
 
చిన్న చిన్న తేలిక పదాలతో రాశారాయన. దాంతో జస్ట్ నాలుగు గంటల్లో ఈ పాట రికార్డింగును పూర్తి చేశాను. నేను గాయని కావాలన్న డాడీ కోరిక ఇలా తీరిందని వివరించింది. వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'దొంగాట'లో అడవి శేష్ తో కలసి లక్ష్మీ జంటగా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu