Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముళ్ళపూడి వారసుని 'కుందనపు బొమ్మ'

ముళ్ళపూడి వారసుని 'కుందనపు బొమ్మ'
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (19:42 IST)
బాపు, రమణలు స్నేహితులు... వారిలో రమణ కుమారుడు వరా.. దర్శకుడిగా మారాడు. కె. రాఘవేంద్రరావు శిష్యుడిగా చాలాకాలం పనిచేశాడు వరా. దాదాపు 43 కథలు రాఘవేంద్రరావుకు వినిపిస్తే ఏదీ నచ్చలేదని చెప్పడంతో అయినా నిరాశ చెందకుండా ప్రయత్నాలు చేయడం జరిగింది. చివరికి 44వ కథ నచ్చడంతో అది సెట్‌పైకి వెళ్ళింది. అదే 'కుందనపు బొమ్మ'. ముక్కోణపు ప్రేమకథ. 
 
గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను భిన్నంగా విడుదల చేశారు. చిత్రంలోని కథానాయిక చాందిని చౌదరి.. స్టేజీపైకి వచ్చి పెండ్లికూతురులా తలదించుకుని కుందనపు బమ్మలా కూర్చొంది. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా, కీరవాణి స్విచ్చాన్‌ చేశారు. చిత్ర దర్శకుడు వరా.. ముసుగు తొలగించారు. ఇదీ ఫస్ట్‌లుక్‌ అని ప్రకటించారు. 
 
చిత్రంగా జరిగిన ఈ తతంంగం తర్వాత  యం.యం.కీరవాణి మాట్లాడుతూ ''ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథ ఇది. అమ్మాయి ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తుందనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా టైటిల్‌ చాలా బావుంది'' అని చెప్పారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''బాపు రమణ నాకు ఆత్మీయులు. వారి కుటుంబసభ్యులు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. ఈ సినిమా టైటిల్‌ చూస్తుంటే బాపు కదిలి వచ్చినట్లుంది'' అని తెలిపారు.
 
ముళ్ళపూడి వరా మాట్లాడుతూ... పాటల చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో జరిగిందని, చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోందని మే నెలలో ఆడియో, రిలీజ్‌ జరుగుతుందని తెలిపారు. చిత్రంను జి.అనిల్‌ కుమార్‌ రాజు, జి.వంశీకృష్ణలు నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu