Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె ప్రియుడితో పబ్లిక్‌గా రొమాన్స్!

బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె ప్రియుడితో పబ్లిక్‌గా రొమాన్స్!
, శనివారం, 14 జూన్ 2014 (17:17 IST)
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇపుడు డబుల్ హ్యాపీగా వున్నాడు. ఓవైపు తన కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా మొదటి సినిమా ''హీరోపంతి''తో హిట్టుకొట్టాడు. మరోవైపు తన కూమార్తె కృష్ణ ష్రాఫ్ తన లైఫ్ పార్టనర్‌ను వెతుక్కుని సెటిలైపోయింది. అంతాబాగానే వుంది కానీ కృష్ణ ష్రాఫ్ ఓ విదేశీయుడితో ప్రేమ వ్యవహారాన్ని పబ్లిక్ చేస్తోంది. తన ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టి పబ్లిక్ అయిపోయింది.

ప్రియుడితో రొమాన్స్ చేయడం తప్పులేదు కానీ రొమాన్స్ చేస్తున్న ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పెట్టడం ఇపుడు సంచలనంగా మారింది. దీని గురించి జాకీ లైట్‌ తీసుకుంటున్నాడు. వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైందని చెబుతున్నాడు. అయితే మాత్రం తమ సరాగాల్ని ఇలా పబ్లిక్‌లో చూపెట్టాల్సిన అవసరం లేదు కదా. అసలే ఒక సీనియర్‌ హీరోకి కూతురు, ఒక యువ హీరోకి చెల్లెలు కాబట్టి కృష్ణ తన రొమాన్స్‌ని ప్రైవేట్‌గా ఉంచుకుంటేనే మంచిదేమో. అసలే మన మీడియా ప్రతి దానిని భూతద్దంలో తప్ప మామూలుగా చూడదాయె.

Share this Story:

Follow Webdunia telugu