Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీను వైట్లకు జర్క్‌ ఇవ్వబోతున్న కోన వెంకట్‌

శ్రీను వైట్లకు జర్క్‌ ఇవ్వబోతున్న కోన వెంకట్‌
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (17:25 IST)
శ్రీను వైట్ల, కోన వెంకట్‌లు ఒకప్పుడు కలిసి పని చేశారు. పలు ఫంక్షన్లకు హాజరైనప్పుడు బ్రదర్‌ అంటూ ఆప్యాయంగా పలుకరించుకునేవారు. అలాంటిది దూకుడు టైమ్‌లో పెద్ద రచ్చే జరిగింది. తను రాసిన డైలాగ్‌లు శ్రీను వైట్ల రాసినట్లు ప్రకటించకోవడమే దీనికి కారణం. దీంతో వారిద్దరి మధ్య చాలా గ్యాప్‌ వచ్చి.. వేరువేరుగా దుకాణాలు పెట్టేశారు. 
 
ఛాలెంజ్‌గా తీసుకుని 'గీతాంజలి' సినిమాకు మాటలు రాసి హిట్‌ చేశాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన 'ఆగడు'లోని డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ పెదవి విరిచారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం... కోన వెంకట్‌ దర్శకత్వం చేయబోతున్నాడు. అది కూడా రవితేజకు.. ఇటీవలే కథను చెప్పాడు. ఆయన ఓకే అన్నాడట. ఇది వచ్చే ఏడాది సెట్‌పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది జరిగితే.. శ్రీను వైట్లకు చెంప పెట్టుగా వుంటుందని కథనాలు విన్పిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu