Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లోటింగ్ మూమెంట్స్... నాకు నీ మినీ స్కర్ట్ పోస్ట్ కావాలి సెక్సీ...

ఫ్లోటింగ్ మూమెంట్స్... నాకు నీ మినీ స్కర్ట్ పోస్ట్ కావాలి సెక్సీ...
, శనివారం, 24 జనవరి 2015 (15:14 IST)
అదేమరి. ఇప్పుడు తారలు సెల్ఫీలు, తాము విదేశాల్లో చేస్తున్న ఎంజాయ్ మెంట్లను వెనుకా ముందూ చూస్కోకుండా ఫేస్ బుక్, ట్విట్టర్లలో పెట్టేస్తున్నారు. వాటిని చూసి కొందరు విషెస్ చెపుతుంటే మరికొందరు హాట్ హేట్ కామెంట్లు పెట్టేస్తున్నారు. నటి కనిక విషయంలోనూ ఇదే జరిగింది. ఒట్టేసి చెపుతున్నా చిత్రం ఫేమ్ కనిక నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబంతో సహా ఫుకెట్ దీవుల్లో ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ చేసింది. 

 
ఇక ఆ ఫోటోలను చూసినవారు రకరకాల కామెంట్లు కొట్టారు. కొందరు హై సెక్సీ... మినీ స్కర్టులో నిన్ను చూడాలని ఉందని అని పేర్కొంటే మరికొందరు ఆమె డ్రెస్ సెన్స్ ను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. దీనిపై కనికకు కోపమొచ్చింది. 
 
వెంటనే రిప్లై కొడుతూ... తాను మినీ స్కర్టులను 20ల్లోనే కాదు 30, 40 అవసరమైతే 50 ఏళ్లకు కూడా ధరిస్తా. నా ఇష్టమొచ్చినన్నాళ్లు ధరిస్తా. వస్త్రధారణకు కాదు మహిళను గౌరవించడం నేర్చుకోండి అంటూ మండిపడింది. తారలు ఇలా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దొరికిపోతే కామెంట్ కింగ్ లు ఊర్కుంటారా మరి.

Share this Story:

Follow Webdunia telugu