Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంచన 2 గంగ రివ్యూ రిపోర్ట్: అదరగొట్టేసిన లారెన్స్.. ఆడియన్స్ టాక్ అదుర్స్!

కాంచన 2 గంగ రివ్యూ రిపోర్ట్: అదరగొట్టేసిన లారెన్స్.. ఆడియన్స్ టాక్ అదుర్స్!
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (10:23 IST)
రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ కాంచన 2కు ఆడియన్స్ టాక్ అదిరిపోయింది. రాఘవ లారెన్స్ బహుపాత్రాభినయం చేసిన లారెన్స్ మూవీకి గుడ్ టాక్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ముని, కాంచన సినిమాలకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ హారర్ మూవీకి ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఆత్మకు ప్రేతాత్మకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో గంగ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో లారెన్స్ బహుపాత్రాభినయంతో అదరగొట్టాడని ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కితాబిచ్చిన నేపథ్యంలో కాంచన 2పై ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్‌లో సూపర్ కామెంట్స్ వస్తున్నాయి.
 
కాగా తాప్సీ హీరోయిన్ రోల్ పోషించిన కాంచన2లో రాఘవ లారెన్స్, కోవై సరళ, జయ ప్రకాష్, పూజ రామచంద్రన్, మనోబాల తదితరులు నటిస్తున్నారు. కాంచన ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో అదిరిపోయిందని, సెకండాఫ్ పూర్తి హారర్‌తో అదరగొట్టాడని ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu