Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'36 ఏళ్ల వయస్సు'లో జ్యోతిక.. కోలీవుడ్‌లో రీఎంట్రీ..!

'36 ఏళ్ల వయస్సు'లో జ్యోతిక.. కోలీవుడ్‌లో రీఎంట్రీ..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:09 IST)
నేటి పోటీ యుగంలో వెండితెరపై ఒక సినిమా హిట్ సాధించాలంటే స్క్రిప్ట్ రైటింగ్ నుంచి విడుదల తేది వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందులోనూ సినిమా పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా పేర్ల కోసం పలువురు పోటీపడుతుంటారు. ఈ విధంగా వినూత్నమైన సినిమా పేర్లు పెట్టడంలో కోలీవుడ్‌నే ఫస్ట్ అండ్ బెస్ట్.
 
ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మధ్య కోలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలిగిన బ్యూటీ జ్యోతిక. అమ్మడు ఆ తర్వాత హీరో సూర్యను వివాహం చేసుకుని ఫ్యామిలీకే పరిమితమైనంది. ఇటీవల మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్న జ్యోతిక వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అందుకు తగినట్టుగా ఆమె నటిస్తున్న తాజా చిత్రానికి '36 వయదినిలే' (36 ఏళ్ల వయస్సులో) అనే టైటిల్‌ను నిర్ణయించారు. 
 
చాలా కాలం గ్యాప్ తర్వాత జ్యోతిక ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు విదితమే. మలయాళంలో హిట్టయిన 'హౌ ఓల్డ్ ఆర్యూ' అనే చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. ఈ సినిమాకి ఏం టైటిల్ పెడదామా? అని చర్చ జరుగుతున్న సమయంలో ఈ '36 వయదినిలే' (36 ఏళ్ల వయసులో) అనే పేరును జ్యోతిక సూచించిందట. అందరూ చాలా బాగుందని అనడంతో దానినే ఖరారు చేస్తున్నారు. దీంతో సినిమాలకు పేర్లు పెట్టడంలో కోలీవుడ్‌కు కోలీవుడ్డే సాటి అని మరో సారి నిరూపించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu