Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఎన్టీఆర్ "రభస": ఆగస్ట్ 15న రిలీజ్!

జూనియర్ ఎన్టీఆర్
, గురువారం, 31 జులై 2014 (11:39 IST)
జూనియర్ ఎన్టీఆర్ రభస ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఆగస్ట్ 15న రభస చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదన్నారు. సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమ బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందన్నారు.
 
రభస ఆడియోను ఆగస్ట్ 1వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా విడుదల చేస్తున్నట్లు బెల్లంకొండ తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందన్నారు. తమన్ సారథ్యంలో రూపొందిన అన్ని పాటలూ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయని, ఎన్టీఆర్‌, తమన్‌ కాంబినేషన్‌లో 'రభస' మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుందన్నారు. 
 
ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్గా చెప్పొచ్చు. గతంలో జూనియర్....యమదొంగ, అదుర్స్, కంత్రీ చిత్రాల్లో గళం విప్పిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu