Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలయాళ చిత్రంలో జేడీ.. నయన సరసకు రెడీ..!

మలయాళ చిత్రంలో జేడీ.. నయన సరసకు రెడీ..!
, బుధవారం, 4 మార్చి 2015 (14:35 IST)
దక్షిణాది చిత్ర సీమలో అగ్రతారగా వెలుగుతున్న క్రేజీ బ్యూటీ నయనతార. ఈ అందాల రాశి ఆ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ సినిమాలకు దూరమైనంది. మళ్లీ వెండితెరకు రీఎంట్రీ అయిన అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్పీడ్‌గా సాగిస్తోంది. తాజాగా నయనతార సిద్ధిక్ దర్శకత్వంలో 'భాస్కర్ ది రాస్కెల్' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో నయనతారకి జోడీగా జెడి చక్రవర్తిని సెలెక్ట్ చేశారు. జెడి చక్రవర్తికి ఇది తొలి మలయాళ సినిమా. డైరెక్టర్ సిద్దిక్ చెప్పిన కథ, నయనతార లీడ్ రోల్ చేస్తుందని తెలియడంతో ఈ సినిమాలో నటించడానికి జెడీ ఓకే చెప్పారట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
 
సెకండ్ ఇన్నింగ్స్ లో నయనతార తెలుగులో చేసిన సినిమా రెండే అయినా తమిళంలో మాత్రం వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటోంది. అలానే మలయాళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. కాగా గతంలో నయనతార హీరోయిన్‌గా నటించిన ‘దుబాయ్ శీను’ చిత్రంలో జెడి చక్రవర్తి నయనతారకు అన్నగా నటించిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu