Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ గారూ.. సోదరి కూతురు వివాహానికి రండి: జయప్రద

కేసీఆర్ గారూ.. సోదరి కూతురు వివాహానికి రండి: జయప్రద
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (19:12 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద సచివాలయంలో కలిశారు. జయప్రద తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌కు జయప్రద వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద కేసీఆర్‌ను కోరారు.
 
కేసీఆర్‌తో భేటీ అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడారు తన సోదరి కూతురు పెళ్లికి ఆహ్వానించేందుకు మాత్రమే కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసి, తమ ఇంట జరిగే పెళ్లికి ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. కేసీఆర్‌తో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశమూ లేదని జయప్రద స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu