Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జెండా పై కపిరాజు' సక్సెస్ మీట్.. మాస్ ఇమేజ్ కొట్టేసిన నాని..!

'జెండా పై కపిరాజు' సక్సెస్ మీట్.. మాస్ ఇమేజ్ కొట్టేసిన నాని..!
, మంగళవారం, 24 మార్చి 2015 (11:11 IST)
లవర్ బాయ్ హీరో నాని తాజా చిత్రాలు 'జెండా పై కపిరాజు', 'ఎవడే సుబ్రమణ్యం' రెండూ ఒకే సారి విడుదలై సక్సెస్ సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ అంతా యమా హ్యాపీగా ఉన్నారు. ఇటీవల జెండా పై కపిరాజు సినిమా సక్సెస్ మీట్  హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండా పై కపిరాజు’ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయన్న టెన్షన్ నాలో ఉండేది. కానీ, ప్రేక్షకులు రెండు సినిమాలను బాగా ఆదరించారు. ‘జెండా పై కపిరాజు’ చూసి పరిశ్రమలోని పెద్దలందరూ అభినందించారు. 
 
మాస్ హీరోగా కూడా ఆదరించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. తెలుగులో తాము చేసిన మొదటి ప్రయత్నానికి మంచి విజయం అందించారని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ అమలాపాల్, మల్టీడైమన్షన్ వాసు, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu