Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాక్వలైన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్ ఛాన్స్: లక్ అంటే అదేనేమో!

జాక్వలైన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్ ఛాన్స్: లక్ అంటే అదేనేమో!
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (12:13 IST)
మాజీ బ్యూటీ క్వీన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ రాత మారబోతోంది. మొన్నటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తూవచ్చిన ఈ భామకు 'కిక్' సినిమా మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ క్రమంలో 'డెఫ్నెషన్ ఆఫ్ ఫియర్' అనే టైటిల్‌తో రూపొందుతున్న హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. ఈ చిత్రంతో ఈ శ్రీలంక బ్యూటీ అద్భుతమైన హాలీవుడ్ నటి అవుతుందంటున్నారు. 
 
మరోవైపు రణబీర్ కపూర్ చేస్తున్న 'రాయ్'లో అమ్మడు డ్యూయెల్ రోల్‌లో చేస్తోంది. ఇటు 'కిక్' దర్శక, నిర్మాత సాజిద్ నడియడ్ వాలా ప్రొడక్షన్‌లో మరో మూడు చిత్రాలకు సైన్ చేసింది. ఇక బాలీవుడ్‌లో జాక్వలైన్‌కు తిరుగులేదని విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu