Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!
, మంగళవారం, 19 మే 2015 (11:43 IST)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మృతి చెందారు. మే 10వ తేదీ అర్థరాత్రి అమెరికాలోని ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్పై వెళ్తున్న విజయ్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యం ఫలించక ప్రాణాలు కోల్పోయారు.
 
చికాగో శివారు ప్రాంతంలో జన్మించిన విజయ్ మోహన్ పాఠశాల విద్య అంతా భారత్‌లోనే జరిగింది. అనంతరం ఆయన టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. ఈయన మృతిపై ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విజయ్ అంకితభావంతో పని చేస్తాడని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu