Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోని ఇంటికి టైట్ సెక్యూరిటీ... అనుష్క ఇంటిపై రాళ్ల వర్షం.. కమాల్ ట్వీట్..!

ధోని ఇంటికి టైట్ సెక్యూరిటీ... అనుష్క ఇంటిపై రాళ్ల వర్షం.. కమాల్ ట్వీట్..!
, శుక్రవారం, 27 మార్చి 2015 (17:31 IST)
వరల్డ్ కప్ సేమీ ఫైనల్స్‌లో భారత్ ఓటమితో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసానికి సెక్యూరిటీ టైట్ చేశారు. ఓటమి కారణంతో అభిమానులు ధోనీ నివాసం వద్ద ఆందోళనలు చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రతను పెంచారు. 
 
మరో వైపు విరాట్ కోహ్లీ అవుటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ ప్రదర్శన పేలవంగా ఉండటానికి బాలీవుడ్ నటి అనుష్క శర్మయే కారణమని ఆరోపిస్తూ విమర్శలు చేస్తున్నారు. 
 
ప్రముఖ బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ అయితే మరింత ముందుకెళ్లి అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు విసరండి... ఆమె సినిమాలను బహిష్కరించండి అంటూ అభిమానులను రెచ్చగొట్టే రీతిలో ట్వీట్ చేశాడు.  ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu