Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాది వైపు ఇలియానా చూపు... మరో రౌండ్ కొడుతుందా..!

దక్షిణాది వైపు ఇలియానా చూపు... మరో రౌండ్ కొడుతుందా..!
, మంగళవారం, 27 జనవరి 2015 (15:57 IST)
బాలీవుడ్ నుంచి దక్షిణాదికి దిగుమతి అయ్యే సినీ తారలు ఒకటి రెండు సినిమాలో చేసీ, మళ్లీ సొంత గూటికి చేరుకుని తిరిగి రారు. మరి కొందరు బాలీవుడ్ భామలు అయితే దక్షిణాదికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోతారు. ఆ కోవలో ఒకప్పుడు దక్షిణాదిరి తెలుగు, తమిళంలో అంటూ హీరోయిన్‌గా సత్తాచాటుకున్న బాలీవుడ్ బ్యూటీ ఇలియానా. కొన్ని చిత్రాలు చేసిన తర్వాత ఈ బ్యూటీ ఆమధ్య తట్టాబుట్టా సర్దుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 
 
ఇక రాదనుకున్న ఈ అమ్మడు ఇన్నాళ్ల తర్వాత తాజాగా ఓ తమిళ చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం. తమిళ నటుడు ప్రశాంత్ హీరోగా అతని తండ్రి త్యాగరాజన్ నిర్మించే 'సాహసం' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుందట. కాగా గత రెండు సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చిన 'జులాయి' చిత్రం ఆధారంగా ఈ 'సాహసం' రూపొందుతోంది. 
 
'జులాయి'లో కూడా ఇలియానానే కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో తమిళంలో కూడా ఆ పాత్రకు ఇలియానానే తీసుకోదలచిన చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇది కుదిరినట్లైతే  ఇలియానా దక్షిణాది లో మరో రౌండ్ కొడుతుందన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu