Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2015 జనవరిలో ఇలియానా పెళ్లి : ఆండ్రూతో డుం.. డుం..

2015 జనవరిలో ఇలియానా పెళ్లి : ఆండ్రూతో డుం.. డుం..
, సోమవారం, 29 సెప్టెంబరు 2014 (16:23 IST)
పోకిరి భామ ఇలియానా సినిమాల్లో నటించే కమిట్‌మెంట్స్‌ను తగ్గించుకుంటోంది. త్వరలో ఇలియానా పెళ్లికూతురు కానుంది. దీంతో కొంతవరకు సినిమాల్లో నటించడం తగ్గించాలనే నిర్ణయించుకుంది. అంతేగాకుండా, కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ఇకపై ఏమీ ఒప్పుకోకుండా ప్రస్తుతం చేస్తోన్న సినిమాలను వీలయినంత త్వరగా పూర్తిచేయాలని ఆమె భావిస్తోంది.
 
కాగా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో గోవా బ్యూటీ ఇలియానా ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. తాజాగా, ప్రియుడు ఆండ్రూతో ఇలియానా పెళ్లి ఓకె అయినట్టు తెలుస్తోంది. ఆండ్రూను పెళ్లి చేసుకోవడానికి ఇలియానా తన ఫ్యామిలీ సభ్యులను ఒప్పించిందని సినీ వర్గాల సమాచారం. అన్నీ, అనుకున్నట్టు జరిగితే ఇలియానా పెళ్లి జనవరి 2015లో జరగవచ్చని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu