Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''ఐ'' సెన్సార్ పూర్తి: U/A సర్టిఫికేట్, జనవరి 9న రిలీజ్!

''ఐ'' సెన్సార్ పూర్తి: U/A సర్టిఫికేట్, జనవరి 9న రిలీజ్!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:05 IST)
''ఐ'' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు శంకర్ చేస్తున్న మహాయజ్ఞం పూర్తయ్యింది. 'ఐ' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. 
 
జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడని దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి కూడా అలాగే పనిచేశాడు. చిత్రాన్ని లేట్ చేసేస్తున్నాడంటూ ఎన్ని విమర్శలు వచ్చినా, సంతృప్తికరంగా వచ్చేవరకు సైలెంటుగా తన పని తాను చేసుకున్నాడు. 
 
ఇప్పుడు చిత్రం ఒక 'ఐ' ఫీస్ట్ గా వుందని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో 'ఐ' పేరుతోనే దీనిని రిలీజ్ చేస్తున్నారు. విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.

Share this Story:

Follow Webdunia telugu