Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హృతిక్ రోషన్ విడాకులు మంజూరు... 13 ఏళ్ల తర్వాత...

హృతిక్ రోషన్ విడాకులు మంజూరు... 13 ఏళ్ల తర్వాత...
, శనివారం, 1 నవంబరు 2014 (17:51 IST)
హృతిక్ రోషన్ పెళ్ళి 13 ఏళ్ల తర్వాత పెటాకులైంది. కోర్టు హృతిక్ రోషన్‌కి, ఆయన భార్య సుజానే ఖాన్‌కి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అమ్మాయిలకు డ్రీమ్‌బోయ్‌లా ఓ వెలుగు వెలిగిన హృతిక్ చివరికి తన భార్య నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొని విడాకులు పొందాల్సి వచ్చింది. ముంబైలోని కుటుంబ కోర్టు శనివారం నాడు వీరిద్దరి పరస్పర అంగీకారం మేరకు విడాకులను ఇచ్చింది.
 
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ దంపతులకు విడుకాలు వచ్చాయి. హృతిక్ 2000 సంవత్సరంలో సుసాన్నెను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రేహన్, హృదన్ ఉన్నారు. హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ స్థితిలో వీరికి శనివారం బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. 
 
ఈ విషయమై హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా మాట్లాడుతూ పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులకు ఇద్దరికీ సంయుక్తంగా అప్పగించినట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu