Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

M.S. నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్!

M.S. నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్!
, గురువారం, 22 జనవరి 2015 (18:24 IST)
ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్లు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు తెలియజేశారు. డయాలసిస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. 
 
కాగా ఎంఎస్ నారాయణ మరణించారంటూ గురువారం ఉదయం కొన్ని తెలుగు ఎలక్ట్రానిక్ ఛానల్స్ హడావుడి సృష్టించిన నేపథ్యంలో ఆ వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. 
 
మొన్న సంక్రాంతికి సొంతూరు వెళ్లిన ఎమ్మెస్ ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు మాదాపూర్ కిమ్స్‌ లో చికిత్స అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu