Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ గన్ పట్టుకుంటే నేను పెన్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నా...

పవన్ గన్ పట్టుకుంటే నేను పెన్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నా...
, సోమవారం, 11 మే 2015 (19:52 IST)
పవన్‌ కళ్యాణ్‌తో ఒక్కసారి సినిమా తీసిన దర్శకుడు మళ్ళీ ఆయనతో సినిమా చేయాలనుకుంటాడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి. గోపాల గోపాల సినిమాను చేసిన దర్శకుడు డాలీ, పవన్‌తో ఏర్పడిన పరిచయంతో మరో చిత్రం చేస్తానని ప్రకటించాడు. కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. తాజాగా గబ్బర్‌ సింగ్‌ తీసిన హరీష్‌ శంకర్‌ మళ్ళీ వపన్‌తో తీయడానికి సిద్ధమయ్యాడు. 
 
ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పవన్‌తో సినిమా ఎప్పుడూ అని అడుగుతున్నారంటూ ట్వీట్‌ చేశారు. దానికి ఆయన బదులిస్తూ... ఈ సినిమా విడుదలయి మూడేళ్లయింది. అయినా ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా వుందంటూ మళ్ళీ అవకాశం ఇస్తే ఆయన గన్‌ పట్టుకుంటారు. నేను పెన్ను పట్టుకుని మంచి స్క్రిప్ట్‌ రాసి సిద్ధంగా వున్నాననంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే గబ్బర్‌సింగ్‌-2కు సిద్ధమవుతున్న పవన్‌.. హరీశ్‌కు అవకాశం ఇస్తాడో లేదో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu