Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్సిక న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్లాన్.. అమెరికాలోని లాస్ వేగాస్‌కు.!

హన్సిక న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్లాన్.. అమెరికాలోని లాస్ వేగాస్‌కు.!
, శనివారం, 20 డిశెంబరు 2014 (11:26 IST)
హన్సిక న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేసేసింది. న్యూ ఇయర్ ఆగమనాన్ని ఎంజాయ్ చేయాలనుకునే తారలు షూటింగులకు లీవ్ పెట్టి మరీ విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇదే తరహాలో బొద్దుగుమ్మ హన్సిక కూడా అప్పుడే తన నూతన సంవత్సర వేడుకను ప్లాన్ చేసేసుకుంది. 
 
గత సంవత్సరం అమెరికాలోని లాస్ వేగాస్‌కి వెళ్ళిన ఈ చిన్నది, ఈసారి కూడా అక్కడికే వెళుతోంది. అక్కడి పబ్స్‌లో స్నేహితులతో డిసెంబర్ 31 రాత్రిని ఆస్వాదిస్తూ, న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటుందట. 
 
ప్రస్తుతం తమిళ చిత్రం షూటింగ్ కోసం ఇటలీ వెళుతున్న ఈ భామ నెలాఖరులోగా ఇండియాకు వచ్చేస్తుంది. రాగానే యూఎస్ ఫ్లయిట్ ఎక్కేస్తుందట. అక్కడ ఓ వారం రోజులు హాయిగా గడిపి వచ్చి మళ్లీ షూటింగుల్లో పాల్గొంటుందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu