Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆనందం ఎక్కడా వుండదంటున్న హన్సిక... ఆశ్రమం కట్టిస్తోంది...

ఆ ఆనందం ఎక్కడా వుండదంటున్న హన్సిక... ఆశ్రమం కట్టిస్తోంది...
, శనివారం, 7 ఫిబ్రవరి 2015 (18:03 IST)
ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో కెరీర్‌ను పొందేవారంతా అది అంతా వెలుగులున్నంత కాలమే అని తెలుసుకుంటున్నారు. జీవితంలో ఎంత సంపాదించినా అది తాత్కాలికమేననే వారిలో వెంకటేష్‌ ముందువరుసలో వుంటాడు. ఇక సేవా కార్యక్రమాలు చేస్తూ మనశ్శాంతి పొందుతున్న వారిలో పలువురు హీరోయిన్లు కూడా ఉంటున్నారు.
 
ఇలియానా, శ్రియ, సమంత, ఖుష్బూ వీరంతా తమకు తోచినవిధంగా సాయం చేస్తుంటారు. హన్సిక కూడా ముంబై శివార్లలో ఆశ్రమం కట్టించడానికి ప్లేస్‌ కొనుగోలు చేసింది. కాగా, ఇప్పటికే 25 మంది పిల్లలను దత్తత తీసుకుని వారికి తగినవిధంగా చదువు చెప్పిస్తుంది. 
 
షూటింగ్‌ల్లో ఎంతో బిజీగా వున్నా.. వారంలో ఒక్కరోజు వారితో గడిపితే వచ్చే ఆనందం మరెక్కడా సాధ్యం కాదంటోంది. ఆ పిల్లల్తో గడుపుతూ.. మాట్లాడుతూ.. చిన్నచిన్న బొమ్మలు మట్టితో చేసినవి ఇచ్చినప్పుడు వాటిని చూసి వారెంతగానో ఆనందపడుతుంటారు. వారి కళ్ళల్లోకి చూస్తే చాలు ఏదో గొప్పదాన్నననే ఫీలింగ్‌ కలుగుతుందని తెలిపింది. నిజమేకదా..!!

Share this Story:

Follow Webdunia telugu