Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌పై కామెంటా.. అబ్బే అవన్నీ వదంతులే: హన్సిక స్పష్టం

పవన్‌పై కామెంటా.. అబ్బే అవన్నీ వదంతులే: హన్సిక స్పష్టం
, బుధవారం, 11 మార్చి 2015 (17:01 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటనకు తాను బిగ్ ఫ్యాన్ అని సినీ నటి హన్సిక తెలిపింది. పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేసిందంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో హన్సిక స్పందించింది. ట్విట్టర్లో హన్సిక ఏవో కామెంట్స్ చేసిందంటూ.. పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

అయితే హన్సిక మాత్రం ట్విట్టర్లో అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. తాను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. పవన్‌పై వ్యాఖ్యలు చేసానని చెప్పిందంతా కట్టుకధ అని తెలిపింది. ఇలాంటి నిరాధార వదంతులను ఆపేయాలని హన్సిక ట్విట్టర్లో కోరింది.
 
కాగా పవన్ కళ్యాణ్ లాగా తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని హన్సిక అన్నట్లు తమిళ పత్రికలు ప్రచురించాయి. దీనిపై హన్సిక వివరణ ఇచ్చింది. ఇంటర్వూలో అలాంటి మాటలు మాట్లాడలేదని అంటోంది. కొంత మంది నేను పవన్ కళ్యాణ్‌పై కామెంట్లు చేసినట్లు అనుకుంటున్నారని అంటోంది.

పవన్‌ను కామెంట్ చేస్తూ తాను ఎలాంటి ఇంటర్వూ ఇవ్వలేదని, కేవలం మీడియా అలా అని ప్రచారం చేస్తోందని తెలిపింది. పవన్ సార్ అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొంది. ఇలాంటి పుకార్లను పుట్టించే వారిని దయచేసి ఆపాల్సిందిగా హన్సిక కోరింది.

Share this Story:

Follow Webdunia telugu