Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విలన్ అవతారమెత్తనున్న బాలీవుడ్ హీరో గోవిందా!

విలన్ అవతారమెత్తనున్న బాలీవుడ్ హీరో గోవిందా!
, శనివారం, 25 అక్టోబరు 2014 (13:16 IST)
బాలీవుడ్ హీరో గోవిందా విలన్ అవతారం ఎత్తనున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'కిల్ దిల్' అనే సినిమాలో గోవిందా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. 
 
"మామూలుగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే సినిమాల్లో విలన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత వుంటుంది. ఇంకా చెప్పాలంటే, హీరోతో సరిసమానంగా వుంటుంది. అందుకే, ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాను. నా అభిమానులకు ఈ పాత్ర బాగా నచ్చుతుంది" అని గోవిందా అంటున్నాడు. 
 
షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న రిలీజ్ చేస్తున్నారు. రన్వీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇందులో జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu