Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోపాల గోపాల ఫస్ట్ లుక్ అదుర్స్: పవన్ స్టైల్లో వెంకీ..

గోపాల గోపాల ఫస్ట్ లుక్ అదుర్స్: పవన్ స్టైల్లో వెంకీ..
, శుక్రవారం, 28 నవంబరు 2014 (19:02 IST)
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్, పవన్ కళ్యాణ్‌ల మల్టీ స్టారర్ 'గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రం బృందం.ఫస్ట్‌ లుక్‌ వీడియోలో పవన్‌కళ్యాణ్‌, ఉయ్యాలలో సేదతీరుతుండగా, వెంకటేష్‌.. పవన్‌కళ్యాణ్‌ సేదతీరుతున్న విధానాన్ని అనుకరిస్తుంటాడు. పవన్ స్టైల్‌ను వెంకీ అనుసరించే విధానం ఫ్యాన్స్ మధ్య మంచి క్రేజ్‌ను పెంచేస్తోంది. దీంతో ఫ్యాన్సంతా అదుర్స్ అంటున్నారు.  
 
పవన్‌కళ్యాణ్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, వెంకటేష్‌ సోదరుడు సురేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానున్న ‘గోపాల గోపాల’ టీజర్‌తోనే ఇటు వెంకీ అభిమానుల్లోనూ, అటు పవన్‌ అభిమానుల్లోనూ భారీగా అంచనాలను పెంచుతోంది.

Share this Story:

Follow Webdunia telugu