Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంచన 2 హిట్... ''గంగ'' విడుదలకు జాప్యమేల..?

కాంచన 2 హిట్... ''గంగ'' విడుదలకు జాప్యమేల..?
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:25 IST)
ప్రముఖ డ్యాన్సర్, నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ నటించిన కాంచన్ -2 ఘన విజయం సాధించింది. అయితే అదే సినిమా తెలుగు రీమేక్ ''గంగ'' మాత్రం ఇంకా విడుదల కాలేదు. కనీసం ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం కూడా స్పష్టంగా వెల్లడి కావడం లేదు. ట్రేడ్ రిపోర్ట్స్ సమాచారం ప్రకారం 'గంగా' సినిమా కొన్ని ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. 
 
అయితే ఈ సమస్యలు అన్నీ సోమవారంతో సమసిపోతాయని, దీంతో ఏప్రిల్ 30వ తేదిన గంగను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ని విడుదల చెయ్యబోతున్న డిస్ట్రిబ్యూటర్స్ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యేందుకు నిర్ణయించారట.

ఆ సమావేశంలో చిత్ర యూనిట్ ఏప్రిల్ 30న గంగను విడుదల చేసే విషయమై చర్చిస్తారని సమాచారం. ఏదేమైన ''గంగ'' విడుదల ఆలస్యం కావడం తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu