Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోపాల గోపాల పూర్తి: గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌లో పవన్!

గోపాల గోపాల పూర్తి: గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌లో పవన్!
, సోమవారం, 22 డిశెంబరు 2014 (18:30 IST)
''గోపాల గోపాల" సినిమా పూర్తవడంతో పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. దీని తర్వాత చేసే 'గబ్బర్ సింగ్ 2' చిత్రం స్క్రిప్టుకు ప్రస్తుతం ఫినిషింగ్ టచ్‌ ఇస్తున్నాడు. దీని షూటింగును వచ్చే నెలలో ప్రారంభిస్తారు. మొదటి షెడ్యూలును పది రోజుల పాటు హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
అనీషా ఆంబ్రోస్ ఇందులో ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూలులో ఈమె కూడా పాల్గొంటుంది. 'పవర్' ఫేం బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తాడని అంటున్నారు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu