Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమీర్ ఖాన్ న్యూడ్: పీకే ఫస్ట్ లుక్‌కు బెదుర్స్ కామెంట్స్!

అమీర్ ఖాన్ న్యూడ్: పీకే ఫస్ట్ లుక్‌కు బెదుర్స్ కామెంట్స్!
, శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:53 IST)
ధూమ్3 సినిమాకు తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించే సినిమా పికె. రాజ్ కుమార్ హిరాణీ డైరక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆరంభం నుంచే చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం ఉదయం అమీర్ ఖాన్ పికె మూవీ ఫస్ట్ లుక్ చూసిన వారంతా బెంబేలెత్తుకున్నారట. 
 
పత్రికల్లో ఫుల్ పేజీగా అమీర్ ఖాన్ న్యూడ్‌గా రైలు పట్టాలపై నిల్చునే పోస్టర్‌ను చూసి అందరూ అదుర్స్ కామెంట్స్ కంటే బెదుర్స్ కామెంట్స్ ఇస్తున్నారట. ఇదేంటబ్బా ఫస్ట్ లుక్కే భయపెడుతోందని అనుకుంటున్నారట. 
 
ఇలాంటి న్యూడ్ ఫోజ్ అవసరమా? అదీ ఫస్ట్ లుక్‌లోనే అంటూ అనేక మంది కామెంట్స్ చేస్తున్నారట. అయితే పికె సినీ యూనిట్ మాత్రం కూల్‌గా సినిమాను చూస్తే ఈ న్యూడ్ సీన్‌కు కారణమేమిటో అర్థమవుతుందని చెబుతోందట. మరి అదండి అమీర్ ఖాన్ న్యూడ్ కథ. 

Share this Story:

Follow Webdunia telugu