Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోపాల గోపాల పవన్ కొత్త లుక్ లీకైంది.. 2015 జనవరిలో సినిమా!

గోపాల గోపాల పవన్ కొత్త లుక్ లీకైంది.. 2015 జనవరిలో సినిమా!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (14:39 IST)
"గోపాల గోపాల" చిత్రంలోని పవన్ కొత్త లుక్ స్టిల్ లీక్ అయ్యింది. షూటింగ్ చూడటానికి లొకేషన్‌లోకి వచ్చిన అనిషా అనే మహిళా అభిమాని పవన్ కొత్త లుక్‌ను తన కెమెరాలో బంధించి బయటికి వదిలేసింది. ఈ స్టిల్‌ని చూసిన అభిమానులు అత్తారింటికి దారేది సినిమాలో హ్యాండ్సమ్‌గా కనిపించి ఇరగదీసిన పవన్ ''గోపాల గోపాల''లో మరింత స్మార్ట్‌గా కనిపించబోతున్నాడని హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. 
 
విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బ్యాక్ పెయిన్ ఆపరేషన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 
 
పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్రస్తుతం షూట్ చేస్తుండగా.. పవన్ లుక్‌ను ఓ ఫ్యాన్ లీక్ చేసేశాడు. కాగా ఈ సినిమాను కిషోర్ పార్థసాని (డాలీ) రూపొందించగా, డి. సురేష్ బాబు, శరత్ మారార్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu