Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విచ్చలవిడిగా సెక్సీ స్టిల్స్, వీడియోలు... సన్నీలియోన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

విచ్చలవిడిగా సెక్సీ స్టిల్స్, వీడియోలు... సన్నీలియోన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
, సోమవారం, 25 మే 2015 (17:12 IST)
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు గూగుల్ సీఈవో, ఓ బాలీవుడ్ మేగజైన్పై కూడా అజ్మీర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అసభ్యత, అశ్లీలత్వంను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. జైపూర్‌లో జైన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ మేగజైన్ కొన్నారు. 
 
అందులో సన్నీలియోన్ హాట్ ఫోటోలతోపాటు ఆ మేగజైన్ వెబ్‌సైట్ అడ్రస్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్‌లో ఆమె ఫోటోల కోసం వెతకగా, అందులో ఆమె వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో ఆయన మహిళల గౌరవానికి భంగం కలిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 292, 292 ఏ, 294 కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆమెతోపాటు గూగుల్‌లో వీడియో ప్రదర్శించినందుకు గూగుల్ సీఈవో లారీపేజ్, ఆ మేగజైన్ యజమానిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, పది లక్షల జరిమానా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఇదివరకే తన సైట్‌లో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిందంటూ సన్నీలియోన్‌పై ఒక మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 
బాలీవుడ్‌లో సెక్సీ బాంబ్‌గా పేరుతెచ్చుకున్న సన్నీకి ఇటీవల సినిమాలలో హిట్లు తగ్గడంతోపాటు, విమర్శలు, ఆరోపణలు, కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో సన్నీ ఎక్కువ రోజులు ఇండియాలో ఉండేట్టు కనిపించడం లేదని, కెనడాకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని సినిమా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu