Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నా.. అవన్నీ పుకార్లే!: డిస్కో శాంతి

నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నా.. అవన్నీ పుకార్లే!: డిస్కో శాంతి
, సోమవారం, 24 నవంబరు 2014 (18:48 IST)
దివంగత నటుడు, మగధీర షేర్ ఖాన్ పాత్రధారి, శ్రీహరి భార్య, స్పెషల్ సాంగ్స్ ద్వారా టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి డిస్కో శాంతి ఆరోగ్యపరిస్థితి బాగాలేదని, క్రిటికల్‌గా ఉన్నట్లు మీడియాలో వస్తున్న రకరకాల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అవన్నీ పుకార్లని శాంతి కొట్టిపడేశారు. 
 
చెన్నైలో డిస్కో శాంతి మీడియాతో మాట్లాడుతూ, తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యం పాలైన విషయం వాస్తవమే అయినప్పటికీ, మీడియా పేర్కొంటున్నట్టు తన పరిస్థితి విషమంగా లేదని చెప్పారు. 
 
వైద్యుల పర్యవేక్షణలో తనకు మెరుగైన వైద్యం అందిందని తెలిపిన ఆమె, ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. చెన్నైలోని తన సోదరి లలితకుమారి ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఆమె వివరించారు.
 
సోషల్ మీడియా పుకార్లతో కంగారుపడ్డ తన కుమారులు, చెన్నైలో ఉన్న తనకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని డిస్కో శాంతి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu