Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రియల్ స్టార్ శ్రీహరి సతీమణి డిస్కోశాంతి ఆరోగ్యం క్రిటికల్ గా...?

రియల్ స్టార్ శ్రీహరి సతీమణి డిస్కోశాంతి ఆరోగ్యం క్రిటికల్ గా...?
, శనివారం, 22 నవంబరు 2014 (20:16 IST)
వెండితెరపై వెలుగుతూ రియల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీహరి కాలేయం సమస్యతో దూరమైన సంగతి తెలిసిందే. ఇపుడు ఆయన భార్య డిస్కోశాంతి కూడా అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనీ, గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. 
 
అక్కడి జనం చెప్పుకుంటున్న ప్రకారం ఆమె కూడా భర్త శ్రీహరిలానే కాలేయానికి సంబంధించిన సమస్యతోనే బాధపడుతున్నారనీ, సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీహరి మరణించిన దగ్గర్నుంచి ఆమె దిగులుతో కుంగిపోయారనీ, అందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యారని చెపుతున్నారు. ఐతే అసలు విషయం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu