Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షారూఖ్‌, కాజోల్‌ కెమిస్ట్రీ నిలబెట్టింది... 1000 వారాలుగా ప్రదర్శన

షారూఖ్‌, కాజోల్‌ కెమిస్ట్రీ నిలబెట్టింది... 1000 వారాలుగా ప్రదర్శన
, గురువారం, 27 నవంబరు 2014 (20:21 IST)
సినిమాలో జోడీగా నటించాలంటే ఇద్దరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ కావాలి. అలా జరిగితే ప్రేక్షకుడు కూడా లీనమవుతాడు. బాలీవుడ్‌లో షారూఖ్‌, కాజోల్‌ కెమిస్ట్రీ సూపర్‌గా వుందట. ఇద్దరూ లవర్స్‌గా అద్భుతంగా నటించారు. అదే వారికి మంచి పేరు తెచ్చింది. రెండు దశాబ్దాల నాడు విడుదలైన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' అనే సినిమా గురించి ఇదంతా. 
 
ఈ చిత్రం ఇండియాలో రికార్డ్‌ సృష్టించింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది. ఈ చిత్రం వచ్చేనెల 12వ తేదీకి వెయ్యి వారాల ప్రదర్శనగా మారబోతుంది. ముంబైలో మరాఠా మందిర్‌ అనే థియేటర్‌లో ఇంకా ఆడుతూనే వుంది. వీకెండ్స్‌లో ఫుల్‌ అవుతుంది. ఫారిన్‌ నుంచి ఇండియా వచ్చిన అబ్బాయి పెద్దల ఆమోదంతో ఇక్కడ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. 
 
కాగా, ఇటువంటి కాన్సెప్ట్‌తో ఆ చిత్రం విడుదల తర్వాత చాలా వచ్చినా ఈ  చిత్రమంత చరిత్ర సృష్టించలేదు. అందుకే చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా.. వచ్చే నెలలో ఈ చిత్రం కోసం కొత్త టీజర్‌ను తయారుచేసి రిలీజ్‌ చేస్తున్నాడు. ఇది సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేట్లుగా వుంటుందని తెలియజేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu