Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తనకు రెండు వక్షోజాలున్నాయంటూ దెప్పిన దీపికా చేస్తుందేమిటి...?!!

తనకు రెండు వక్షోజాలున్నాయంటూ దెప్పిన దీపికా చేస్తుందేమిటి...?!!
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:11 IST)
స్త్రీలకు స్వేచ్చలేదని రాజకీయనాయకులు అనడం మామూలే. నటీమణులు కూడా అదేవిధంగా తయారయ్యారు. రాజకీయనాయకులు మహిళ ఓట్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇప్పుడు ఆ కోవలోనే బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే చేరింది. మహిళలను గౌరవించాలంటూ... మహిళ కాబట్టి తనకు పైన ఎద సంపద వున్నదంటూ.. దాన్ని హైలైట్‌ చేస్తూ.. వార్తలు రాయడం తప్పంటూ.. తెగ గొడవ చేసింది. కానీ ఆమె మాటలకు చేతలకు పొంతనే లేదు. 
 
చెప్పేటప్పుడు తాను ఏం చేస్తున్నాననో అనేది గ్రహించాలని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే విడుదలైన 'ఫైండింగ్‌ ఫనీ'లో హీరోతో లిప్‌లాక్‌లు, జాకెట్‌ విప్పేసి హీరోపై పడిపోవడాలు చేసిన దీపికా.. అంతకంటే ఎక్కువగా 'హ్యాపీ న్యూ ఇయర్‌' చిత్రంలో 'లవ్లీ' అనే పాటను చేసింది. అందులో వస్త్రధారణ కూడా అభ్యంతరకరంగా వుంది. 
 
యువతను రెచ్చగొట్టే దుస్తులు వేసి మత్తు ఎక్కించే కళ్ళతో కన్నుగొట్టడాలు వంటి సన్నివేశాలు అందులో వున్నాయి. వృత్తిపరంగా ఇటువంటివి చేసినా అవి వ్యక్తిగత క్యారెక్టర్‌పై పడుతుంది. ఇలాంటివారు సమాజం కోసం ఏవోవో చెప్పేసి ఆ తర్వాత ఆమె పాత్రలకు సంబంధించి కామెంట్లు వస్తే గయ్యమంటూ పడిపోవడం తప్పు కాదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu