Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభేదాలు లేవు : దాసరి నారాయణ రావు!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభేదాలు లేవు : దాసరి నారాయణ రావు!
, మంగళవారం, 25 నవంబరు 2014 (11:21 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి విభేదాలు లేవని దర్శకరత్న దాసరి నారాయణ రావు చెప్పారు. సినీ పరిశ్రమలో తరాలు మారుతున్నా... సినిమాకి, ప్రేక్షకుడికి ఉన్న అనుబంధం మాత్రం శాశ్వతంగానే ఉందన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న 'మేము సైతం' అనే కార్యక్రమాన్ని చిత్ర పరిశ్రమ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాదులో ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఇందులో దాసరి మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా చిత్ర పరిశ్రమ తన వంతు సాయం చేసింది. ఇప్పుడు హుదూద్ బాధితులను ఆదుకోవడానికి మరోసారి పరిశ్రమ ముందుకొచ్చింది. ఇంతకు ముందు జరిగిన ప్రెస్ మీట్‌కు దాసరి రాలేదని... ఈ రోజు సమావేశానికి వేరే వాళ్లు రాలేదని... పరిశ్రమలో విభేదాల వల్లే ఇలా జరుగుతోందని కొందరు అంటున్నారు. వాస్తవానికి, చిత్ర పరిశ్రమలో ఎలాంటి విభేదాలు లేవు. ఎవరి వీలును బట్టి వారు హాజరవుతుంటారు. అంతే" అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu