Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాల 'దానవీరశూరకర్ణ'... మే 28న విడుదలకు సన్నాహాలు...

బాల 'దానవీరశూరకర్ణ'... మే 28న విడుదలకు సన్నాహాలు...
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:26 IST)
బాలనటీనటులతో జె.వి.ఆర్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దానవీరశూకర్ణ'. చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టారు. దివంగత జానకిరామ్‌ పెద్దకుమారుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటించారు.
 
దర్శకుడు మాట్లాడుతూ... జనవరిలో ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో అహరహం శ్రమించి చిత్రీకరణ పూర్తి చేశాం.  బాలనటీనటులంతా మేమూహించిన దానికన్నా బాగా నటించారు. కృష్ణునిగా నటిస్తున్న మాస్టర్‌ ఎన్టీఆర్‌ తాతకు తగ్గ మనవనిగా పేరు తెచ్చుకుంటారనటంలో సందేహంలేదు. మాస్టర్‌ ఎన్టీఆర్‌ తమ్ముడు సౌమిత్ర సహాదేవుని పాత్రను అద్భుతంగా పండిరచాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
 
నిర్మాతలు తెలుపుతూ... 18 ఏళ్ల విరామానంతరం అందరూ బాల నటీనటులతో వస్తున్న చిత్రం. ఎంతో శ్రద్ధాసక్తులతో, చక్కని స్క్రిప్ట్‌తో, ఆకట్టుకునే సెట్స్‌తో, ఆభరణాలతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకులు జె.వి.ఆర్‌ ప్రతీ సీన్‌ను అద్భుతంగా తీస్తున్నారు. అలాగే సీనియర్‌ నటీమణి జమున మనవడు ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించాడు. చాలా మంది సీనియర్‌ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం. మే 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు
 
కాజా సూర్యనారాయణ నిర్మాణ నిర్వహకుడిగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రంలో  జయంత్‌ సాయి, యశ్వంత్‌, దిలీప్‌తేజ, శ్యామ్‌గోపాల్‌, కారుణ్య, భార్గవి, యామిని, సాహిత్య, విజ్జు, అభిరామ్‌, చందన్‌, గణేష్‌, దినేష్‌, లోహిత తదితర బాలురు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మేకప్‌మేన్‌: సి.మాధవరావు, నృత్య దర్శకురాలు: ప్రమీల, కళాదర్శకులు: ఎస్‌.ఆర్‌.కె.శర్మ, ఎడిటర్‌: నందమూరి హరి.

Share this Story:

Follow Webdunia telugu