Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవితకు బెయిల్.... ఆ స్క్రోలింగులన్నీ ఉత్తవే...

జీవితకు బెయిల్.... ఆ స్క్రోలింగులన్నీ ఉత్తవే...
, మంగళవారం, 25 నవంబరు 2014 (14:37 IST)
డాక్టర్ రాజశేఖర్ భార్య జీవితకు చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన నేపధ్యంలో ఆమె వెంటనే 25 లక్షలు చెల్లించడంతో బెయిల్ వచ్చేసింది. 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాతకు జీవిత ఇచ్చిన 22 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో ఆమెకు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. 
 
జీవిత కోర్టుకు 25 లక్షల డబ్బు చెల్లించి బెయిల్ వచ్చేసింది. ఐతే తనకు మీడియాలో స్క్రోలింగుల్లో వేసినట్లు ఎలాంటి శిక్షలు పడలేదని జీవిత చెప్పుకొచ్చారు. తనను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు.
 
కాగా నటి జీవిత 'ఎవడైతే నాకేంటి' సినిమా సమయంలో నిర్మాత శేఖర్‌కు 22 లక్షల చెక్‌ను ఇచ్చింది. అది కూడా బౌన్స్‌ అయింది. ఇది జరిగి రెండేళ్ళయింది. కానీ ఇంతకువరకూ సరైన క్లారిటీ రాలేదు. దాంతో కేసు వేయడంతో దానిపై సోమవారం తీర్పు వచ్చేసింది.
 
హైదరాబాద్‌లో ఎర్రమంజిల్‌ కోర్టు ఆమెకు రూ.25 లక్షలతో పాటు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీనితో ఆమె అవాక్కయింది. వెంటనే కోర్టుకు 25 లక్షలు చెల్లించడంతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Share this Story:

Follow Webdunia telugu