Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాది బహుమతిగా 'రుద్రమదేవి' ఆడియో విడుదల..!

ఉగాది బహుమతిగా 'రుద్రమదేవి' ఆడియో విడుదల..!
, శనివారం, 21 మార్చి 2015 (15:24 IST)
అందాల రాశి అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ దర్శకనిర్మాణంలో బ్రహ్మాండంగా రూపొందుతున్న చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుంది. విశాఖపట్నంలో, వరంగ‌ల్‌లో అంటూ రెండు ప్రాంతాలలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని గుణశేఖర్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.
 
ఆ ప్రకారం మార్చి 21వ తేదీ శనివారం ఉగాది పర్వదినం రోజున విశాఖపట్టణం ఎమ్.జిఎం పార్క్ బీచ్‌లో సాయింత్రం ఏడు గంటలకు జరిగే ఉత్సవంలో రుద్రమదేవి ఆడియోను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా మార్చి 22వ తేదీ ఆదివారం వరంగల్ లోని ఫోర్ట్ వరంగల్ ప్రాంగాణంలో సాయింత్రం 7 గంటలకు మరో సారి ఆడియోను విడుదల చేశారు. 
 
ఈ విధంగా రెండు చోట్ల చెరో మూడు పాటల వంతున విడుదల చేస్తున్నారు. విశాఖపట్నంలో జరగనున్న ఆడియో వేడుకకు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. అదేవిధంగా వరంగల్‌లో జరిగే ఆడియో వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రప్పించే ప్లాన్ చేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu