Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో.. స్వాతి అంత పనిచేసిందా..? అనసూయకు అందుకే?

అమ్మో.. స్వాతి అంత పనిచేసిందా..? అనసూయకు అందుకే?
, మంగళవారం, 27 జనవరి 2015 (17:37 IST)
కలర్స్ ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా వ్యవహరించిన కలర్స్ స్వాతి అంచలంచెలుగా హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కలర్స్ స్వాతి మంచి మంచి ఆఫర్లు రావడంతో నాగార్జున సరసన నటించే అవకాశాన్ని కలర్స్ స్వాతి చేతులారా పోగొట్టుకుంది. 
 
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో తాజాగా 'సోగ్గాడే చిన్ని నాయన' అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తాత, మనవడు పాత్రల్లో డ్యూయల్ రోల్‌లో ఆయన కనిపిస్తారు. తాత పాత్ర పక్కన రమ్యకృష్ణ నటిస్తోంది. ఇక మనవడి పాత్రకు స్వాతిని అడిగారట. ఆమెకు కూడా చేయాలని ఉండడంతో ఓకే చెప్పింది. 
 
అయితే, డేట్స్ విషయానికి వచ్చేసరికి క్లాష్ రావడంతో సారీ చెప్పిందట. ప్రస్తుతం తను తమిళ, మలయాళ సినిమాలలో బిజీగా వుంది. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదు. ఇలా ఈ ముద్దుగుమ్మ వదిలేయడంతో, ఆ అవకాశం హాట్ యాంకర్ అనసూయను వరించింది!

Share this Story:

Follow Webdunia telugu