Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్... అదిరిందయ్యా అన్నయ్యా...

మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్... అదిరిందయ్యా అన్నయ్యా...
, గురువారం, 21 ఆగస్టు 2014 (17:28 IST)
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి దాదాపు ఆరేడేళ్లపాటు ముఖానికి రంగు వేసుకోవడం ఆపేసిన అన్నయ్య చిరంజీవి మళ్లీ మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి శరీరాన్ని ఫిట్ గా మార్చేశారు. హ్యాండ్ సమ్ బాడీని తెచ్చుకునేందుకు గత కొన్ని నెలలుగా రోజుకు మూడు గంటల పాటు జిమ్ లోనే గడుపుతూ ఉన్నారు చిరంజీవి. 
 
150 వ సినిమా తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో దాని కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండటంతో వారి కోర్కెను నెరవేర్చేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. 
 
దాదాపు 150 చిత్రానికి సంబంధించిన వర్క్ పూర్తయిందేమోగానీ తాజాగా చిరంజీవి తన న్యూ లుక్ ఫోటోషూట్ ని విడుదల చేసేశారు. ఇకపోతే 150వ చిత్రం వివరాలను రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తమ్మీద చిరంజీవి ఫోటో షూట్ మాత్రం అదుర్స్ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu