Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నారికి చిరు ఛాన్స్...! 150వ సినిమాలో...!

చిన్నారికి చిరు ఛాన్స్...! 150వ సినిమాలో...!
, గురువారం, 25 డిశెంబరు 2014 (16:09 IST)
మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలు నటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ యం.యన్.జే. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన చిన్నారి అభిమాని బాలుని కలిసి, అతనికి తన 150 చిత్రంలో ఛాన్స్ ఇస్తానని  హామీ ఇచ్చారు.
 
ఆదిలాబాద్ జిల్లా అడేగామ గ్రామానికి చెందిన బాలుకి క్యాన్సర్ వ్యాధి సోకడంతో గత మూడేళ్లుగా హైదరాబాద్ యం.యన్.జే. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆ బాలుడుని, తల్లి తండ్రులని ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలు తనకు చిరంజీవిని చూడాలని ఉందని తెలిపాడు. 
 
ఆ సంగతి తెలుసుకొన్న చిరంజీవి గురువారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాలుని కలిసేందుకు కాసేపు ముచ్చటించారు. అంతే కాదు అతనికి కొన్ని బొమ్మలు కూడా బహుకరించారు. ఆ సందర్భంగా చిరంజీవి ఆ బాలుడితో కొంత సేపు మాట్లాడినప్పుడు అతను చిరంజీవిని “మీరు మీ 150వ సినిమా ఇంకా ఎప్పుడు తీస్తారు?” అని ప్రశ్నించాడు. “మంచి కధ దొరికితే వెంటనే మొదలుపెడతానని” చిరంజీవి చెప్పారు. 
 
ఈ సందర్భంగా బాలు ఆయనని రెండు కోర్కెలు కోరాడు. ఆయన డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందని, అలాగే ఆయన తీయబోయే 150 సినిమాలో తను కూడా కనిపించాలని ఉందని కోరాడు. అందుకు చిరంజీవి ఏ మాత్రం సందేహించకుండా వెంటనే అంగీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu