Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భరత్ సరసకు వైట్ బ్యూటీ నో... పెద్ద హీరోలైతే ఓకే..!

భరత్ సరసకు వైట్ బ్యూటీ నో... పెద్ద హీరోలైతే ఓకే..!
, మంగళవారం, 3 మార్చి 2015 (13:31 IST)
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ తమ్మన్నా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు సాదా సీదా హీరోల సరసన నటించడానికి ఈ మిల్క్ బ్యూటీ పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదట, పెద్ద హీరోలతో అంటనే ఓకే చెబుతున్నట్టు టాలీవుడ్ టాక్. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆ వార్తకు ఊతమిచ్చేలా ఉంది. 
 
ఇక అసలు విషయానికొస్తే.. తమిళంలో ‘బాయ్స్’, ‘ప్రేమిస్తే’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ కెరీర్ ఆ తర్వాత ఆశాజనకంగా సాగలేదు. ఆ చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ఆ హీరోను ఒక్క హిట్టు కూడా వరించలేదు. ప్రస్తుతం ఓ భారీ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ చిత్రంతో తన కెరీర్ కి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నాడట. సినిమా గ్రాండ్‌గా ఉండాలి కాబట్టి, ఈ చిత్ర దర్శక, నిర్మాతలతో తమన్నాని తీసుకుందామని చెప్పాడని సమాచారం. 
 
ఆ మేరకు చిత్ర దర్శక, నిర్మాతలు తమన్నాని సంప్రదిస్తే ఈ చిత్రంలో నటించడానికి కుదరదని చెప్పేసిందట. మార్కెట్ బాగున్న ఈ సమయంలో చిన్న హీరో పక్కన నటిస్తే, క్రేజ్ తగ్గుతుందని భావించే, ఈ చిత్రాన్ని తిరస్కరించిందని సమాచారం.

గత 2009లో భరత్ సరసన తమన్న ‘కండేన్ కాదలై’ అనే చిత్రంలో నటించింది. అప్పుడు తమన్నాకన్నా భరత్‌ మార్కెట్ పెద్దది. అందుకని అతను పనికొచ్చాడనీ, ఇప్పుడు తన మార్కెట్ పెద్దది కాబట్టి, తమన్నాకి భరత్ పనికి రాలేదని పరిశీలకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu