Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండ్ల గణేష్‌‌ పై చీటింగ్ కేసు : 420, 406, 506 కింద కింద.. నిర్మాత పరారీ!

బండ్ల గణేష్‌‌ పై చీటింగ్ కేసు : 420, 406, 506 కింద కింద.. నిర్మాత పరారీ!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (10:29 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత బండ్ల గణేష్‌ మీద హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా హక్కులు ఇచ్చే విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారంటూ ధర్మచరణ్ తులసీ అనే ఫైనాన్సియర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 
 
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరో ఫైనాన్షియర్‌కు బండ్ల గణేష్ అప్పగించాడు. 
 
దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ వైపు నుంచి స్పందన లేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బండ్ల గణేష్ మీద ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న బండ్ల గణేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu