Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లూఫిలిం నటి ఏం నటించి చూపిస్తుందని కోట్లు...

బ్లూఫిలిం నటి ఏం నటించి చూపిస్తుందని కోట్లు...
, శనివారం, 12 జులై 2014 (19:25 IST)
ఎక్కడో కెనడాలో ఉంటూ బ్లూఫిలింలో నటించిన సన్నీలియోన్‌కు బాలీవుడ్‌లో పెద్దపీట వేస్తే... ఇప్పుడు తెలుగులోనూ అదేతీరుగా ఉందని కొందరు వాపోతున్నారు. సినిమాలో నటించాలంటే.. నటీనటులు పెర్‌ఫార్మెన్స్‌ ఉన్నవారు కాదనీ, ఇప్పుడు వాటికి అర్థం మారిపోయిందని విమర్శించేవారు ఉన్నారు. కొందరు హీరోయిన్లు ఇలాంటివే చెబుతున్నారు.
 
ఆమధ్య పోలీసుల ఉచ్చులో పడిన జ్యోతి అనే నటికూడా సెటైర్లు వేస్తోంది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాలినీలను పెట్టి ఐటంగాళ్ గా ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత హీరోయిన్లే చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం వారికి కాకుండా బ్లూఫిలింలో చేసేవారికి రావడం దురదృష్టకరమని అంటోంది. ఇదే అభిప్రాయాన్ని ఫేమస్‌ నటి చార్మి కూడా తెలియజేస్తుంది.
 
అగ్ర దర్శకులు, అగ్ర హీరోలతో చేసిన ఆమెకు ఇప్పుడు ఛాన్స్‌లు పెద్దగా లేవు. ఇండస్ట్రీలో కొత్తమోజు కొంతవరకే.. రేపు సన్నీ కూడా పాత పడిపోతుంది. కానీ ఆమెకు మంచు ఫ్యామిలీ కోట్ల ఆఫర్‌ ఇచ్చి చేయాల్సిన అవసర ఏమిటి? ప్రేక్షకులకు ఆమె ఏం నటించిందని చెబుతారు? ఆమ పేరు వినగానే శృంగార చిత్రాలే గుర్తుకు వస్తాయి కదా! అని మండిపడుతుంది. 
 
కాగా, ఇటీవలే సన్నీ భర్తకు అద్భుతమైన డ్రెస్‌‌ను మంచు మనోజ్‌ బహూకరించారు. 'కరెంట్‌ తీగ' షూటింగ్‌లో ఆమెతో పాటు ఉన్న ఆమె భర్తకు బహుమర్యాదలు చేసినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu